Saturday, 22 November 2014

నిజాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి....

పిన్ని గారూ... ఈ మధ్య మా ఆయన అన్నీ నిజాలే చెబుతుంటుంటే చాలా సంతోషంగా ఉంది..
ఇంతకీ ఆ మార్పుకి కారణం ఎమిటీ...
మరేం లేదు పిన్నిగారు... ఆయనకు క్యారియర్ తోపాటు కిన్లే వాటర్ బాటిల్ పెడుతున్నా... బొట్టు..బొట్టులో నిజాయితీతో అన్ని నిజాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి....

Friday, 14 November 2014

పని పిల్లలం..పసి మొగ్గలం..

పని పిల్లలం..పసి మొగ్గలం..

పిల్లలం..పిల్లలం..
బడి ఈడు బాలలం..
పలకా బలపం ఎరుగం..
పని పాటలే ప్రతినిత్యం..
యూనిఫారాల హంగులు లేవు..
మాసిన బొత్తాలు లేని చొక్కాలు తప్ప..
పాలిష్ షూల తళకులు లేవు...
అరిగిన హవాయి చెప్పులే రక్ష
ఫేస్ పౌడర్ల పై పూతలు లేవు..
దుమ్ము,ధూళి, మసి మరకలే మా సౌందర్య సాధనాలు
బిస్కేట్లు, చాక్లేట్లు, బర్గర్లు, పిజ్జాల రుచులు తెలియవు..
మిగిలిన పాచి బన్ను ముక్కలే కేకులు
లంచ్ బాక్సులో బిర్యానీలు లేవు..
విస్తరాకుల్లో ఎంగిలి మెతుకులే కిచిడీలు మాకు...
బడి పిలుస్తోంది రా.... అంటారు..
నీకు ఈ ఒక్కరోజు అదృష్టమే చాలంటారు..
బాలల దినోత్సవాలు లేవు..
ఆ సంబరాలలో బ్యానర్లు మోసే భావి భారత కార్మికులం..
చాచాజీ జయంతి వేడుకల్లో ఛాయ్ లు అందించే చోటూలం..
పసిమొగ్గలం మేం..
పనిపిల్లలం మేం..
విధాత గీసిన గీత..
ఎన్నేళ్లైనా మారదా మా తల రాత...

- పాణిగ్రాహి రాజశేఖర్





Thursday, 6 November 2014

కార్తీకపౌర్ణమి

మిత్రులందరికీ కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు.

Thursday, 23 October 2014

కాకర పువ్వోత్తుల జిలుగులు, మతాబుల మెరుపులు

హలో ఫ్రెండ్స్..దీపావళి పండుగ బాగా చేసుకున్నారా.. మేము ఉల్లాసంగా..ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నాం. పండుగలన్నింటిలోకెల్లా ఆనందాన్ని ఇచ్చే అసలైన పండుగ ఇదే. టపాసుల మోతలు,

కాకర పువ్వోత్తుల జిలుగులు, మతాబుల మెరుపులు, చిచ్చుబుడ్ల వెలుగులుతో సందడిగా చేసుకున్నాం. మా అమ్మయి నవ్య, అబ్బాయి బాలు బాణాసంచా కాలుస్తున్న  ఆ ఆనంద క్షణాలను ఇలా మీతో పంచుకుంటున్నా...

దీపావళి శుభాకాంక్షలు...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు...


Friday, 10 October 2014

Balasrivatsa Birthday Celebrations

My son Balasrivatsa Birthday Celebrations at my house in vijayawada
(09-10-2014)

Sunday, 28 September 2014

విజయవాడ కనకదుర్గాదేవి అలంకారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి.

ఈ రోజు
విజయవాడ కనకదుర్గాదేవి అలంకారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి. అమ్మ దర్శనం సకల శుభకరం 

Wednesday, 10 September 2014

Tuesday, 2 September 2014

చిత్రసీమకు "బంగారం"

మెగాస్టార్ 'తమ్ముడు '
అభిమానులకు ఆరాధ్యుడు
చిత్రసీమకు "బంగారం"
ఈ "అన్నవరం"
"బాలు", "జానీ","బద్రి"గా "జల్సా" చేసినా..
"పులి"లా "పంజా" విసిరిన "గబ్బర్ సింగ్" అతడు
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు.

- పాణిగ్రాహి రాజశేఖర్

Monday, 1 September 2014

Friday, 29 August 2014

బెజవాడ బొజ్జగణపయ్యలు భలేగున్నారు..

బెజవాడ బొజ్జగణపయ్యలు భలేగున్నారు..


హాయ్ ఫ్రెండ్స్..ఈరోజు చవితి వేడుకలను చక్కగా చేసుకున్నాము. సాయంత్రం నుంచి నేను కుటుంబ సమేతంగా గణేశ్ పందిళ్ళను చూసేందుకు వెళ్ళాం. తొలుత ఒన్ టౌన్ వట్లూరి వారి వీధిలో 17 అడుగుల ఎత్తులో పేపర్ కప్స్ తో చేసిన ఏకో గణపతి ఆకర్షణీయంగా ఉంది. సాయిబాబా తో కూడిన భారీ విగ్రహం కూడా ఆకట్టుకుంది. వీటిని చూసేందుకు అర గంట నిల్చున్నాం. అక్కడ నుంచి సమ్మెట వారి వీధి, పూలభావి వీధి, మార్వాడి గణపతిలను చూసేసరికి మా పిల్లలు నిద్రకు వచ్చారు. దీంతో ఇంటికి వచ్చేశాం.. శుభరాత్రి.

వినాయక చవితి శుభాకాంక్షలు.....

వినాయక చవితి శుభాకాంక్షలు.....

Friday, 22 August 2014

ఆంధ్రుల ఆవేశం...

ఆంధ్రుల ఆవేశం...
ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం..
టంగుటూరి ప్రకాశం...
నేడు 142వ జయంతి.....

మనసు దోచిన 'దొంగ '

చిత్రసీమకు 'మగమహారాజూ
ఆంధ్రుల మనసు దోచిన 'దొంగ '
అవినీతిపై అస్త్రం సంధించిన 'ఠాగూర్ '
ఫ్యాక్యనిష్టుల పనిపట్టిన 'ఇంద్ర '
అభిమానుల పాలిట ' ఆపద్బాంధవుడు '
రిక్షావోడైనా.....కిరాతకుడైనా....
దొంగమొగుడైనా...యముడికి మొగుడైనా....
'అందరివాడు ' మెగాస్టార్
'అన్నయ్య ' చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు....

Sunday, 3 August 2014

Friday, 1 August 2014

తనికెళ్ళ భరణి గారితో మాటా మంతీ.

తనికెళ్ళ భరణి గారితో మాటా మంతీ..


ఇటీవల విజయవాడలో జంధ్యాల పురస్కారం అందుకోవడానికి వచ్చిన రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి గారిని హోటల్ ఐలాపురం లో కలిసినప్పుడు కాసేపు ఆయన మనసు విప్పి మాట్లాడారు. నేను, మా బావగారు వేలూరి కౌండిన్య(సాక్షి కల్చరల్ విలేకరి) గారితో కలిసి భరణి గారి ఇంటర్వ్వూ తీసుకున్నాం. తెలుగు భాష కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని వందేళ్ళ సాహిత్య చరిత్రలో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగినన్ని సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంకా తన సినిమాలు, చేపట్టబోయే ప్రాజెక్ట్ లు సుమధురతో తన అనుబంధం ఇలా తన మదిలో భావాలను మాతో పంచుకున్నారు. ఈ సందర్భంలో భరణి గారితో నేను దిగిన పిక్..
 

Thursday, 31 July 2014

ఆదిలోనే హంసపాదు...

ఆదిలోనే హంసపాదు...

దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ... ఉత్సవమూర్తులను వివిధ వాహనాలపై ఊరేగిస్తూ ఉంటారు. ఆసమయంలో కొందరు భక్తులు ఉత్సవ వాహనాన్ని  తమ భుజాలపై మోస్తారు. ఉత్సవం జరుగుతున్నంత సేపూ దాన్ని మోయడమంటే తేలిక కాదు. కాబట్టి మధ్యమధ్యలో వాహనాన్ని భుజాలపైనుంచి దించే వెసలుబాటును కల్పించారు. వాహనాన్ని కింద పెట్టకూడదు. దానికోసం ఆంగ్ల అక్షరం "వై" ఆకారంలో ఉండే కర్రలను ఏర్పరిచారు. వీటిని హంసపాదులంటారు. వాహనాన్ని హంసపాదుపై పెట్టడమంటే ఆ కాసేపూ ఊరేగింపునకు అంతరాయం ఏర్పడినట్టే కదా ! అందుకే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు విఘ్నం ఏర్పడితే... ఆదిలోనే హంసపాదు అంటూ ఉంటారు....


సేకరణ : ఆదివారం సాక్షి

Wednesday, 30 July 2014

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..


అదును దాటినా వరుణుడి కరుణ లేక అన్నదాతలు ఎదురుచూపులు ఫలించాయి. నాలుగు రోజులుగా ఎ
డతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వ్యవసాయపనుల్లో రైతులు తలమునకలయ్యారు. ఐతే..నగరాల్లో మాత్రం జనజీవనం స్తంభించింది. కాసులకు కక్కుర్తిపడి అధికారుల వేసిన నగర రోడ్లు అసలు రూపం బయటపడింది. రాజధాని కాబోయే విజయవాడ నగరం రహదారులు అధ్వానంగా మారాయి. అడుగుకో గొయ్యి..గజానికో తటాకం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దుర్గగుడి వద్ధ హైవే కూడా గతుకులమయంగా మారింది. నిధులు లేవనో సాకుతో అధికారులు పట్టించుకోవడం లేదు. మరి సీఎం ప్రమాణ స్వీకారానికి, భవంతుల ఆధునికికరణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రజలే దేవుళ్ళు..సమాజమే దేవాలయం అని చెప్పిన పార్టీ ప్రజలకు చేసిన సేవ ఇదేనా...

Thursday, 24 July 2014

నమస్కారం....

నమస్కారం....

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2.  మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3.  గురుదేవులకు నుదుటి దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4.  దేవతలకు తలపై (నుదిటి పైన మణికట్టు అంటేలా ) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి.



సేకరణ : శ్రీ కనకదుర్గ ప్రభ

Sunday, 13 July 2014

కృష్ణశాస్త్రి పుట్టినరోజు

ఈరోజు మా మేనల్లుడు వేలూరి కృష్ణశాస్త్రి పుట్టినరోజు. జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తారు కదూ...

Saturday, 12 July 2014

ఆచార్యదేవోభవ


ఈరోజు గురుపూర్ణిమ. గురువులను సత్కరించుకోవడం మన కర్తవ్యం. నాకు జర్నలిసంలో ఓనమాలు నేర్పిన గురువుగారు శ్రీ హరిప్రసాద్ గారు. ఈనాడు దినపత్రికలో విలేకరిగా చేరిన నాకు వార్త రాసే విధానం, కథనాల ఎంపిక తదితర అంశాలపై ఎంతో చక్కగా వివరించారు. నా జీవితాంతం హరిప్రసాద్ గారిని మరవను. మధ్యలో ఒకసారి ఫోన్ లో మాట్లాడా.. మళ్ళీ ఆయనను కలవలేకపోయాను. ఈ ముహపుస్తకం ద్వారా ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

Tuesday, 8 July 2014

"మ"కారాలను విడిస్తేనే సంపద దరిచేరుతుంది

"మ"కారాలను విడిస్తేనే సంపద దరిచేరుతుంది


"మ" కారాలనగా మద్యం, మాంసం, మగువ, ఇవే ధనాలను హరించేవి. ఇవి ఉన్నదగ్గర శ్రీ మహాలక్ష్మి ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వేచి ఉంటుంది. సమయం చూసుకొని శెలవు తీసుకుంటుంది. ఈ "మ"కారాల వల్లే కీచకుడు, ధుర్యోధనుడు, జరాసందుడు, తమ తమ వైభోగాలను, సకల సంపదలను, హితులను వదులుకోవాల్సి వచ్చింది.


సేకరణ : ఆరాధన పత్రిక

Saturday, 5 July 2014

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు ......

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు ......

వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లిచేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు ... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నాతల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకురమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో  పడ్డారు.  కానీ పార్వతిలాంటి  అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పటినించి ఈ సామెత పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదిరవుతుంటే "వినయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారయింది పరిస్థితి" అనడం రివాజుగా మారింది.


సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది......

Saturday, 21 June 2014

"క్రూర"గాయాలు

నిన్న కృష్ణా తరంగాలు గ్రూప్ లో నిర్వహించిన చిత్ర కవిత పోటీలో నన్ను విజేతగా ప్రకటించారు. నేను రాసిన ఆ కవిత ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

"క్రూర"గాయాలు
భానుడి విశ్వరూపం
విలవిల లాడుతున్న జనం
సాగునీటి ఇక్కట్లు..
కూరగాయల ధరలకు రెక్కలు
ఆకాశంలో ధరలు
వినియోగదారుడి జేబుకి చిల్లులు
టమాటా...ఇరవై పై మాట..
బెండ..దొండ..వంగ..
కొనాలంటే..బెంగ..
సరుకు రవాణాపై మోడి మోత
ప్రజలకు వాత
ప్రభుత్వాలు మారినా మారని సగటు జీవి బతుకు చిత్రం
జీవితమంతా వ్యధాభరితం
పాణిగ్రాహి రాజశేఖర్
21-6-14

Thursday, 5 June 2014

రోజురోజుకు...

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడదాం


పర్యవరణ పరిరక్షణ అందరి బాధ్యత. కాంక్రీట్ జంగిళ్ల లాంటి మన నగరాల్లో కాలుష్యం రోజురోజుకు అధికమవుతుంది. చాలా సంస్థలు మొక్కలు నాటుతున్నట్లు పత్రికల్లో ఫొటోలు దిగి ఆ తర్వాత వాటి సంరక్షణ బాధ్యతలు విస్మరిస్తున్నారు. దీంతో మన లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతిఒక్కరూ ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్ళిరోజు లకు బహుమతుల బదులు మొక్కను ఇవ్వడం ఆనవాయితీ పెట్టుకుంటే భవిష్యత్ తరాలు కాలుష్య రక్కసి బారి నుంచి రక్షించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే విజయవాడలో ప్రభుత్వ ఉపధ్యాయుడు పులిపాటి దుర్గారావు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టి పలువురి ప్రశంసలు పొందారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమంతా కూడా మనకు చేతనైనంత మేరకు మొక్కలు నాటుదాం..ప్రగతికి బాటలు వేద్దాం. 

Wednesday, 28 May 2014

చాలా అలసిపోయాం..


హలో... బాగున్నారా... మేము ఏమి చేస్తున్నామని చూస్తున్నారా?..మరేమో మా బావ పెళ్ళికి మేమే పెద్దలం. అందుకే ఇలా పసుపు దంచుతున్నాం. ఇంతకీ మీకు రోకలి అంటే తెలుసా.. మా నాన్నమ్మ దాని గురించి చెప్పడమే కాక..ఇలా మాతోనే పెళ్లి పనులు చేయిస్తున్నారు..

చాలా అలసిపోయాం..నాకూ(నవ్య)..చిన్నగా ఉంది చూడండీ లక్కీకి తలో ఐస్ క్రీం ఇస్తారు కదూ...