Tuesday 28 January 2014

చిలిపి ఊహల


సేలయేటి సవ్వడులు...

యదలో నీ చిలిపి ఊహల అలజడులు...



29-1-14 పాణిగ్రాహి రాజశేఖర్

అలజడి...


Thursday 23 January 2014

Tuesday 21 January 2014

గాడ్ ఫాదర్ ఇకలేరు .....



చిత్రసీమకు "జమీందారు"
తెలుగుప్రజల నాడి పట్టిన "డాక్టర్ చక్రవర్తి"
"కులగోత్రలు" పట్టింపు లేని "బాటసారి"
"పల్లెటూరి పిల్ల"కోసం "మాయాలోకం"లో
"కీలుగుర్రం" ఎక్కి "పల్నాటి యుద్ధం" చేసిన "బాలరాజు"
"అన్నదాత" పిలుపైనా....
"తోడికోడళ్ళ" ముచ్చట్లైనా...
"ఇల్లరికం" అల్లుడి పాటైనా...
ఇంటింటి "ఇలవేల్పు" అయ్యాడు..ఈ "పూలరంగడు"
"జై జవాన్" అన్నా.. "ధర్మదాత" అయినా...
"బంగారు బాబు" లాంటి "మరుపురాని మనిషి" అతడు..
"అందమైన అమ్మాయి కోసం"
"ఏడంతస్తుల మేడలో"
"ప్రేమాభిషేకం" చేసిన
"బుచ్చిబాబు"
తెలుగు సినీ కుటుంబానికి "గాడ్ ఫాధర్"
"చుక్కల్లో చంద్రుడ"య్యాడు.

(అక్కినేని నాగేశ్వరరావు గారికి అశృనివాళి)

Monday 20 January 2014

నీ ఫ్రేమ రుచుల...

నీ ఫ్రేమ రుచులకు గుర్తులివిగో..


Sunday 19 January 2014

పాణీలు-11

పాణీలు-11

ఆ సినిమా శతదినోత్సవ సంబరాలు
షూటింగ్ ప్రారంభించి వంద రోజులు పూర్తయిన సందర్భం మరి

ఉద్యమం ఉధృతం కావాలని పూజలు
ప్రింటింగ్ ప్రెస్ లు, ఫ్లెక్స్ యూనిట్ల వ్యాపారి మరి


పాణిగ్రాహి రాజశేఖర్, 20-1-14

Saturday 18 January 2014

పాణీలు -10

పాణీలు -10


ఆ పోస్టింగ్ కి లెక్కకు మించి లైకులు
పోస్ట్ మహిమ కాదు.."ఆడ" వాసన కిక్


క్యాబ్ లో ఒంటరిగా ఆడపిల్ల ప్రయాణం..
భయం లేదు..అది ఇండియా కాదు..


19-1-14 పాణిగ్రాహి రాజశేఖర్

వెండితెర దేవుడు

వెండితెర దేవుడు
"అందాల రాముడు""రాజుపేద"లందరికీ
"జయసింహు"డతడు
సినీ "మాయాబజార్"లో
"అగ్గిరాముడతడు"
"భూకైలాసం"లో
"కార్తికేయుని కథ"లు చెప్ఫే
"సారంగధరుడు"
"అప్పు చేసి పప్పు కూడు" వద్దంటాడు
"కలిసుంటే కలదు సుఖ"మంటాడు
"రక్తసంబంధం" లేకున్నా
అందరూ "ఆత్మ బంధువులే"నంటాడు
"మనుషుల్లో దేవుడు"
సినీ వినీలాకాశంలో "తార"క రాముడు


(18-1-14) నందమూరి తారక రామారావు వర్ధంతి.


పాణిగ్రాహి రాజశేఖర్ 

Tuesday 14 January 2014

తిన్నారా? తింటారా?

తిన్నారా? తింటారా?

మిత్రులారా...ఏమిటి మీ ఇంట్లో ఇంకా వంటలు కాలేదా? మరేం పర్వాలేదు.మా నెట్టింట్లో వడ్డన కూడా పూర్తయింది. పంచభక్ష పరమాన్నాలతో విందు సిధ్ధంగా ఉంది. మరీ ఈ ఐటములన్నీ మీ అరిటాకులో వున్నాయో లేవో చూసుకొండి.. పండుగ పూట మీ ఇంట తింటారా? మా వంట భోంచేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్.. తిన్నాక బ్రేవ్ మని త్రేనుపు రావాలి.

హరిలో రంగహరి...

స్నేహితులందిరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు...

Monday 13 January 2014

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

 మకర సంక్రాంతి శుభాకాంక్షలు





Designed by Dakshayani Graphics, 

Friday 10 January 2014

పాణీలు-9

పాణీలు-9


కొండను పిండి చేస్తానన్నాడు
బలశాలి కాదు. అక్రమ గనుల లీజుదారుడు


షేర్స్ పర్చేజ్ చేయమంటే
ఏ పిక్ షేర్ చేయను అన్నాడు.ఎఫ్ బీ పిచ్చోడు మరి


11-01-14 పాణిగ్రాహి రాజశేఖర్

Wednesday 8 January 2014

పాణీలు-8


పాణీలు-8


వాడి బండి దూసుకుపోతోంది..నరకానికి పర్మిట్ లభించిందన్న సంతోషంతో..


ఎప్పటికీ అతడే స్టార్..మిగతా స్టార్ లను తొక్కి వచ్చిన వామనుడతడు...


08-1-14 పాణిగ్రాహి రాజశేఖర్

Tuesday 7 January 2014

నా వ్యంజకాలు.

జనవరి సాహితీకిరణంలో ప్రచురితమైన నా వ్యంజకాలు..చదివి మీ అభిప్రాయం తెలుపగలరు.

www.sahithikiranam.com

అక్షర పండగ

అక్షర పండగ


ఈ రోజు నేను సాహితీ క్షేత్రంలో విహరించాను. అక్షర సుగంధ పరిమళాలతో నా మది పులకించింది. విజ్ఞానం, వినోదం, విద్య, సాహిత్య తేజో మూర్తులు, అపురూప చిత్రాలు, సాంకేతిక సీడీలు, మరెన్నో అక్షర సుమాలు...అన్నీ ఒకేచోట. అదేనండి మా విజయవాడలో జరుగుతున్న పుస్తకాల పండుగకి నేనూ వెళ్ళాను. ఎన్నో అలనాటి మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు వున్నాయి. పిల్లలకు నీతి కథలతో పాటు చిత్రలేఖనం పుస్తకాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.  పాత కథలు, పాత సంచికలు సాహితీ ప్రియుల మనసుదోచుకుంటాన్నాయి. వీటికి తోడు  పుస్తకావిష్కరణలు, సమీక్షలు, పరిచయసభలు, ప్రముఖుల ఉపన్యాసాలతో అక్షర ప్రేమికులకు నిత్యం సాహితీ విందు. మరి మా పుస్తకాల పండుగకి మీకు కూడా స్వాగతం...సుస్వాగతం... జనవరి 12 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.

Monday 6 January 2014

పాణీలు-7

పాణీలు-7


అతడు కంప్యూటర్ ట్యూటర్..
లెసన్స్ అన్నీ ట్విట్ట్ ర్ లోనే...

ఆ సినిమా విజయంపై అతడికి కోటి ఆశలు
నిర్మాత కాదు..పైరసీ సీడీ విక్రేత...


6-01-14 పాణిగ్రాహి రాజశేఖర్

Wednesday 1 January 2014

శ్రీశ్రీ జయంతి ఎప్పుడు?

శ్రీశ్రీ జయంతి ఎప్పుడు?


మిత్రులకు శుభోదయం..శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ) జయంతిని నేడు కొంతమంది చేస్తున్నారు. కాని వాస్తవానికి ఆయన ఏప్రిల్ 30 1910న జన్మించారు. మరి ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం
కావడం లేదు. పండుగలు మిగులు,తగుల్లతో రెండు రోజులు వస్తున్నాయి. మరి ప్రముఖుల జయంతులు, వర్థంతుల విషయంలో ఈ అయోమయం ఎందుకు?నాకు తెలియదు. మిత్రులకెవరికైనా తెలిస్తే వివరించగలరు.