Friday 31 May 2013

నమో వెంకటేశా..నమో శ్రీనివాసా..



ఈ రోజు మా బంగారు తల్లి, మా కంటి వెలుగు, మా గారాల పట్టీ నవ్యశ్రీ కి జన్మదినోత్సవం



Tuesday 28 May 2013


పథకం - పతనం 


అమ్మ హస్తం, అభయ హస్తం
పేదోడికి రిక్తహస్తం
"ఇందిరమ్మ" ఇంతేనమ్మా
"ఉపాధి" ఉత్తిదేనమ్మా
"ఇందిరమ్మ కలలు" కల్లలేనమ్మా
"పచ్చ తోరణం" కట్టలేదమ్మా
రాజీవ్ యువ కిరణం
అంతా ప్రచార ఆర్భాటం
యువతకు ఉద్యోగం
గగన కుసుమం
ప్రచారానికి కోట్లకు కోట్లు
సంక్షేమానికి లక్షల్లోనే కేటాయింపులు
పల్లేల్లో దాహం కేకలు
పట్టించుకోని పాలకులు
వస్తున్నాయి ఎన్నికలు
నాయకులను పక్కన పెడదాం
సేవకులను ఎన్నుకుందాం


పాణిగ్రాహి రాజశేఖర్ 28-05-13 









Saturday 25 May 2013


ఆమే..నేను


ఆమె నాలో సగం
కాదు..కాదు..
నేనే ఆమె..ఆమే నేను..
నా ఆలోచనలకు ఊపిరిపోస్తుంది
నా అక్షరాలకు రూపమిస్తుంది
నా కవితలకు తొలి పాఠకురాలవుతుంది
నా అదుగుజాడే ఆమెకు వెలుగునీడ
అడుగుతడబడకుండా వెన్నంటే ఉంటుది తోడునీడగా..
అనురాగ ప్రియరాగాలు ఆలపిస్తోంది
నా మాటల తూటాల గాయాలనూ మౌనంగా భరిస్తోంది
నా కోపాగ్నిపై ప్రేమ జల్లులు కురిపిస్తోంది..
నా విరహం తట్టుకోలేనంటుంది..
నేనే తన ప్రాణమంటుంది..
ఆమె కోసం నేను... నా కోసం ఆమె..


(ఈ రోజు నా శ్రీమతి సుజాత జన్మదినోత్సవం సందర్భంగా)


Tuesday 21 May 2013


గోల..గోల


అడ్మిషన్ల వేళప్రచార గోలహై టెక్, ఈ టెక్ఎన్నో ట్రిక్స్ మరెన్నో కాన్సెప్ట్స్విద్యా సంస్థలకు కాసుల పంటతల్లిదండ్రులకు అప్పుల తంటా

Tuesday 14 May 2013


అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మబెజవాడ కనకదుర్గమ్మ


Saturday 11 May 2013


అమ్మా..వందనమమ్మా...


నవమాసాలు మోసింది
పేగు బంధం పంచింది
చనుబాలమృతం పట్టింది
బొసి నవ్వులకు మురిసింది
జోలపాటలతో జోకొట్టింది
గోరుముద్దలతో తీపి ముద్దులు ఇచ్చింది
తన కాళ్లే ఊయలగా మార్చింది
బుడి బుడి అదుగులు తడబకుందా ఊతకర్రైంది
పాడు కళ్ళు పడకూడదని దిష్టి తీసింది
ఎదిగేకొద్ది ఒదిగి ఉండమని హితులెన్నో చెప్పింది
ధైర్య సాహసాలు ఆభరణమంది
ఆధ్యాత్మిక చింతన అవసరమంది
నైతిక విలువలు నేర్పింది
బతుకు సమరంలో విజేతవు కావాలని
అక్షరాయుధాన్ని వరంగా ఇచ్చింది
ప్రేమతో అనురాగ సాగరంలో ఓలలాడించింది
అన్నీ ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియదంది
నా వృద్ధినే కోరింది
అభివృద్ధికి బాటలు వేసింది
మా మమతల కోవెలలో అనురాగ దేవత అమ్మ
కనిపించే దైవం అమ్మ


(ఈ రోజు మాతృ దినోత్స
వం సంధర్భంగా)

పాణిగ్రాహి రాజశేఖర్ (12-5-13)


















Tuesday 7 May 2013

సాహితీకిరణం మాసపత్రిక మే సంచికలో ప్రచురితమైన నా కవిత



Monday 6 May 2013

సాహితీకిరణం మాసపత్రిక మే సంచికలో ప్రచురితమైన నా వ్యంజకాలు


Sunday 5 May 2013


అక్షరం 
అక్షరం నా నేస్తం
నాతోనే కలిసుంటుంది ప్రతిక్షణం
నా ఊహలతో ఊసులాడుతుంది
ఆలోచనలను ఆవిష్కరిస్తుంది
అనుభవాలను పంచుకుంటుంది
హృదయ వీణను మీటుతుంది
ఆత్మ ఘోషను ఆలకిస్తుంది
ఒంటరితనాన్ని దూరం చేస్తుంది
నీకు నేనున్నానంటూ అండగా నిలుస్తోంది
అందుకే అక్షరం అంటే నాకిష్టం
అది లేకుండా బతకడం కష్టం


5-5-13. పాణిగ్రాహి రాజశేఖర్.








Saturday 4 May 2013


తీశాను తెల్లకాగితం
కూర్చాను అక్షర హారం
చేశాను కవితా గానం
సభా మందిరంలో జనం మాయం


(ఈ రోజు నవ్వుల దినోత్సవం సందర్భంగా సరదాగా రాసినది)



నవ్వు కెవ్వు కేక

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్షవం


Friday 3 May 2013

స్వప్న మే సంచికలో...


స్వప్న మే సంచికలో ఈ నెల పాఠకుడులో నా పరిచయం