Tuesday 30 April 2013



కడుపు కోతలు


పొలాల్లో యంత్రాలతో కోతలు
కూలీలకు ఆకలి మంటలు
ఖార్ఖానాల్లో కరెంటు కోతలు
కార్మికుల వేతనాల్లో కోతలు
ఉపాధి పనుల్లో అవినీతి మేట్లు
శ్రమజీవుల కూలి డబ్బుల్లో ఆమ్యామ్యాలు
మూతపడుతున్న పరిశ్రమలు
రోడ్డునపడుతున్న ఉద్యోగులు
ఎన్ని మేడేలు వచ్చినా
కార్మిక కుటుంబాల్లో ప్రసరించని వెలుగులు
ఉత్సవం వద్దు...పేదోడి కడుపు నింపు..


(కార్మిక దేవుడికి ఇదే నా అక్షరాంజలి)


పాణిగ్రాహి రాజశేఖర్ (30-4-13, 11.13 పి.ఎం.)


కడుపు కోతలు


పొలాల్లో యంత్రాలతో కోతలు
కూలీలకు ఆకలి మంటలు
ఖార్ఖానాల్లో కరెంటు కోతలు
కార్మికుల వేతనాల్లో కోతలు
ఉపాధి పనుల్లో అవినీతి మేట్లు
శ్రమజీవుల కూలి డబ్బుల్లో ఆమ్యామ్యాలు
మూతపడుతున్న పరిశ్రమలు
రోడ్డునపడుతున్న ఉద్యోగులు
ఎన్ని మేడేలు వచ్చినా
కార్మిక కుటుంబాల్లో ప్రసరించని వెలుగులు
ఉత్సవం వద్దు...పేదోడి కడుపు నింపు..


(కార్మిక దేవుడికి ఇదే నా అక్షరాంజలి)


పాణిగ్రాహి రాజశేఖర్ (30-4-13, 11.13 పి.ఎం.)











పండుగ రోజు


అమ్మలకో రోజు...
నాన్నలకో రోజు...
పిల్లలకో రోజు...
వృధ్ధులకో రోజు...
లవర్స్ కో రోజు...
కలర్స్ కో రోజు...
కవి మిత్రులకు
ప్రతిరోజు పండుగ రోజు

- పాణిగ్రాహి రాజశేఖర్, 30-4-2013.

Monday 29 April 2013


అమ్మో..ఆడపిల్లా..


ఒకప్పడు..
ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అన్నారు
పనిపాటల్లో ప్రథమురాలిగా నిలుస్తుందన్నారు
చదువుల్ల్లో సరస్వతికి మారుపేరన్నారు
ప్రేమాప్యాతలకు ప్రతిరూపమన్నరు
అమ్మాయున్న ఇల్లు సిరి సంపదలకు నెలవన్నారు
మరిప్పుడు..

పాకే వయస్సులోనే పాడు చూపులతో వేటగాళ్ల వలలు
పరిగెత్తే వేళ కిడ్నాపర్ల చెరలు
బడికెళ్లే దారిలో బంగారం కోసం కిరాతక హత్యలు
హైస్కూల్ దశలోనే ప్రేమ అంటూ వెంటపడే పోకిరీలు
కాలేజిలో మాస్టార్ల కామ కలాపాలు
రోడ్డెక్కితే వెధవల రోతపు మాటలు
తోడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితులు
నిమిషానికో లైంగిక దాడి
గంటకో గ్యాంగ్ రేప్
ఆడపిల్లను ఎలా కాపాడేది..
ఆమెకు రక్షణ ఎలా ఇచ్చేది..
ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా..
కొనసాగుతునే ఉన్నాయి అత్యాచారాలు..
ఆడ వాసన రుచి మరిగిన మనవ మృగాల వనంలో
నేను వదలలేను నా లేడి కూనను
కళ్ళప్పగించి చూస్తూ ఉండలేను...
అమ్మో ఆడపిల్ల అనకుండా వుండలేను..











Saturday 27 April 2013

My son Bala Srivatsa,  and

daughter Navya Sri  in krishna getup 

Friday 26 April 2013

Tuesday 23 April 2013

Wednesday 17 April 2013

Monday 15 April 2013


వ్యంజకం


కవి


సమాజ రుగ్మతలపై స్పందిస్తాడు
అక్షర అస్త్రాలు సంధిస్తాడు
తను రాసిందే కవిత్వమంటాడు
ఇతరుల కవితలు చదవడు


Saturday 13 April 2013

11-4-2013 ఉగాది రోజు విజయవాడ హోటల్ స్వర్ణా ప్యాలేస్ లో సాహితి స్రవంతి నిర్వహించిన సాహిత్య సభలో నా కవితా పఠనం వేదికపై సీనియర్ జర్నలిస్ట్ వి.పద్మ, కొత్తపల్లి రవి బబు వున్నారు. 


Friday 12 April 2013


హాయ్ ఫ్రెండ్స్...
64 కళలు.కాం వెబ్ మ్యాగజైన్ ఎప్రిల్ ఇష్యూ లో వచ్చిన నా కవిత 

Thursday 11 April 2013


ఉగాది గీతిక

కోయిలల కుహు కుహు రాగాలు లేకున్నా
సెల్ లో రికార్డ్ కూతలతో మేలుకున్నా
షడ్రుచుల ఉగాది పచ్చడి తిన్నా
కవితా సమ్మేళనాలలో పాల్గొన్నా
వసంత లక్ష్మికి స్వాగత గీతికలు పాడుకున్నా


Saturday 6 April 2013



బాల్యం 


గుర్తుకొస్తున్నాయి
చిన్నప్పుడు ఆముదపు దీపం గుడ్డివెలుతురులో
అమ్మ దిద్దించిన ఓనమాలు
అ ఆలు రాలేదని ఇసుకలో రాయించిన శిక్షలు
పాఠశాలకు వెళ్ళనని మారం చేస్తే తాయిలంగా ఇచ్చిన పప్పుండలు
అక్క చేసి ఇచ్చిన కాగితపు ఫ్యాన్లుతో
పొలం గట్లపై పరుగులు
నాని గాడు, సూరి గాడితో ఆడిన గోలీలాటలు
గౌరమ్మ జాతరలో రంగులరాట్నం ఎక్కి నేను చేసిన హాహాకారాలు
తెలుగు పద్యాలు చెప్పలేదని వేసిన గోడ కుర్చీలు
నాన్న తెచ్చిన పీసు మిఠాయి కోసం అక్కతో చేసిన ఫైటింగులు
కొత్త బట్టల కోసం అటకెక్కిన అలకలు
గోమాత దూరమైనప్పుడు నాన్న కంటి నుంచి రాలిన కన్నీటి చుక్కలు
ఎవరూ చూడకుండా మామ్మ దాచి ఇచ్చిన పిప్పర్ మెంట్ బిళ్ళలు
బాల్యపు స్మ్రుతులు
వెంటాడె తీపి గుర్తులు


Thursday 4 April 2013


స్టూడెంట్


పగలు నెట్ జన్
రాత్రి పబ్ జన్

Wednesday 3 April 2013


టీవీ ఛానళ్లు


సంచలనాలకు వేదికలు
గోరంతది చేస్తారు కొండంతలు
బ్రేకింగ్ ల కోసం
బతికుండగానే తీస్తున్నారు ప్రాణాలు 

Tuesday 2 April 2013


చిట్టి కవిత


ఫేస్ బుక్ లో బుక్కుయ్యాను
బుక్కు తీయడం మరిచాను
బ్లాగ్ లో లాగ్ అయ్యాను
పెన్ను పట్టడం మానేశాను
కీ బోర్డుకి కితకితలు పెట్టాను
నవ్వుల పువ్వుల కవితలల్లాను