Wednesday 19 June 2013

Joke

శ్రీ : అరే బాలూ నా కవితకన్నా నీ కవితకు ఎక్కువ లైక్ లు ఎలా వచ్చాయిరా?
బాలు : ఏమీలేదు.. నా కవితకు లైక్ లు కొట్టినవారికి యాభై రూపాయలు రీచార్జి చేయిస్తానని నోట్ పెట్టాలే అందుకని...
శ్రీ : ఆ..ఆ....!!!!




Tuesday 18 June 2013


ఇసుకాసురులు


నాడు చెరువుల్లో జలకళలు
సెలయేటి గళగళలు
నదీ పాయల్లో నీటి సిరులు
పల్లెల్లో ప్రకృతి సోయగాలు
నేడు
నదీ పాయల్లో అక్రమ తవ్వకాలు
ఏరులే ఇసుక రీసులు
ఇసుకాసురుల దందాలు
ఆగని అక్రమాలు
అడ్డుకున్న అధికారులపై అమానుష దాడులు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ముంచుకొస్తున్న ప్రళయాలు
పట్టించుకోని పాలకులు


పాణిగ్రాహి రాజశేఖర్ 18-6-13  

Central Ministers from Andhra Pradesh


Wednesday 12 June 2013


Joke

సుబ్బారావు : అరే అప్పారావు ఈ రోజు నేను మా ఆవిడను తిట్టానోయ్..
అప్పారావు : అంత ధైర్యం ఎలా వచ్చిందిరా?
సుబ్బారావు : మరేమో మా ఆవిడ నన్ను పచ్చడి బండతో కొట్టిందిరా..
అప్పారావు : ఆ..ఆ...


(నేను రాసిన ఈ జోక్ విజేత సండే బుక్ లో వచ్చింది(విజేత 2001లో గుంటూరు కేంద్రంగా ప్రచురితమయ్యేది)

Sunday 9 June 2013


నేతల పర్యటనలు అవసరమా?


కార్పొరేటర్ నుంచి ప్రధాన మంత్రుల దాకా విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. వాటివల్ల వారు సాధించిన ప్రగతి ఎమిటో ఎవరికి తెలియదు. వందల కోట్ల రూపాయలతో వారు షికార్లు చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారే తప్ప ప్రజలకు, దేశానికి ఉపయోగపడడం లేదు. మరి మీరేమంటారు...నిజం కాదంటారా? ఇంతకీ మన ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా...అక్షరాలా 642 కోట్లు..తొమ్మిదేళ్లలో 67 విదేశీ పర్యటనల ఖర్చు అది. ఈ వివరాలు పి ఎం ఓ కార్యాలయమే అందించింది.

Friday 7 June 2013

దిన, వార, మాస, త్రైమాస, పత్రికల తొలి సంచికలు సేకరించి లిమాక బుక్ రికార్డ్స్ కెక్కిన పులిపాటి దుర్గారావు గురించి నేను రాసిన వ్యాసం సాహితీకిరణం జూన్ సంచికలో ప్రచురితమైంది.