Thursday 31 July 2014

ఆదిలోనే హంసపాదు...

ఆదిలోనే హంసపాదు...

దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ... ఉత్సవమూర్తులను వివిధ వాహనాలపై ఊరేగిస్తూ ఉంటారు. ఆసమయంలో కొందరు భక్తులు ఉత్సవ వాహనాన్ని  తమ భుజాలపై మోస్తారు. ఉత్సవం జరుగుతున్నంత సేపూ దాన్ని మోయడమంటే తేలిక కాదు. కాబట్టి మధ్యమధ్యలో వాహనాన్ని భుజాలపైనుంచి దించే వెసలుబాటును కల్పించారు. వాహనాన్ని కింద పెట్టకూడదు. దానికోసం ఆంగ్ల అక్షరం "వై" ఆకారంలో ఉండే కర్రలను ఏర్పరిచారు. వీటిని హంసపాదులంటారు. వాహనాన్ని హంసపాదుపై పెట్టడమంటే ఆ కాసేపూ ఊరేగింపునకు అంతరాయం ఏర్పడినట్టే కదా ! అందుకే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు విఘ్నం ఏర్పడితే... ఆదిలోనే హంసపాదు అంటూ ఉంటారు....


సేకరణ : ఆదివారం సాక్షి

Wednesday 30 July 2014

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..

వాన వచ్చే..గొయ్యి తెచ్చే..


అదును దాటినా వరుణుడి కరుణ లేక అన్నదాతలు ఎదురుచూపులు ఫలించాయి. నాలుగు రోజులుగా ఎ
డతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వ్యవసాయపనుల్లో రైతులు తలమునకలయ్యారు. ఐతే..నగరాల్లో మాత్రం జనజీవనం స్తంభించింది. కాసులకు కక్కుర్తిపడి అధికారుల వేసిన నగర రోడ్లు అసలు రూపం బయటపడింది. రాజధాని కాబోయే విజయవాడ నగరం రహదారులు అధ్వానంగా మారాయి. అడుగుకో గొయ్యి..గజానికో తటాకం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దుర్గగుడి వద్ధ హైవే కూడా గతుకులమయంగా మారింది. నిధులు లేవనో సాకుతో అధికారులు పట్టించుకోవడం లేదు. మరి సీఎం ప్రమాణ స్వీకారానికి, భవంతుల ఆధునికికరణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రజలే దేవుళ్ళు..సమాజమే దేవాలయం అని చెప్పిన పార్టీ ప్రజలకు చేసిన సేవ ఇదేనా...

Thursday 24 July 2014

నమస్కారం....

నమస్కారం....

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
1.  రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2.  మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3.  గురుదేవులకు నుదుటి దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4.  దేవతలకు తలపై (నుదిటి పైన మణికట్టు అంటేలా ) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

ఇది భారతీయ ఆచార విధి.



సేకరణ : శ్రీ కనకదుర్గ ప్రభ

Sunday 13 July 2014

కృష్ణశాస్త్రి పుట్టినరోజు

ఈరోజు మా మేనల్లుడు వేలూరి కృష్ణశాస్త్రి పుట్టినరోజు. జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తారు కదూ...

Saturday 12 July 2014

ఆచార్యదేవోభవ


ఈరోజు గురుపూర్ణిమ. గురువులను సత్కరించుకోవడం మన కర్తవ్యం. నాకు జర్నలిసంలో ఓనమాలు నేర్పిన గురువుగారు శ్రీ హరిప్రసాద్ గారు. ఈనాడు దినపత్రికలో విలేకరిగా చేరిన నాకు వార్త రాసే విధానం, కథనాల ఎంపిక తదితర అంశాలపై ఎంతో చక్కగా వివరించారు. నా జీవితాంతం హరిప్రసాద్ గారిని మరవను. మధ్యలో ఒకసారి ఫోన్ లో మాట్లాడా.. మళ్ళీ ఆయనను కలవలేకపోయాను. ఈ ముహపుస్తకం ద్వారా ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

Tuesday 8 July 2014

"మ"కారాలను విడిస్తేనే సంపద దరిచేరుతుంది

"మ"కారాలను విడిస్తేనే సంపద దరిచేరుతుంది


"మ" కారాలనగా మద్యం, మాంసం, మగువ, ఇవే ధనాలను హరించేవి. ఇవి ఉన్నదగ్గర శ్రీ మహాలక్ష్మి ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వేచి ఉంటుంది. సమయం చూసుకొని శెలవు తీసుకుంటుంది. ఈ "మ"కారాల వల్లే కీచకుడు, ధుర్యోధనుడు, జరాసందుడు, తమ తమ వైభోగాలను, సకల సంపదలను, హితులను వదులుకోవాల్సి వచ్చింది.


సేకరణ : ఆరాధన పత్రిక

Saturday 5 July 2014

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు ......

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు ......

వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లిచేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు ... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నాతల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకురమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో  పడ్డారు.  కానీ పార్వతిలాంటి  అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పటినించి ఈ సామెత పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదిరవుతుంటే "వినయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారయింది పరిస్థితి" అనడం రివాజుగా మారింది.


సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది......