Thursday 25 July 2013


వాగ్ధానాల ఝరిలో తడవకు
ప్రలోభాల లోయలో మునగకు
తాయిలాల తాంబూలాలు స్వీకరించకు
మందుచుక్క కోసం మురిసిపోకు
అసమర్ధుడిని ఎన్నుకోకు
యోగ్యతకు ఓటు...అదే వెలుగు నీకు


 ఈరోజు (26-7-13) సాక్షి కృష్ణాజిల్లా ఎడిషన్ ఎన్నికల పేజిలో నేను రాసిన కవిత ప్రచురితమైంది. 


Wednesday 24 July 2013


నిన్న వాడొక పార్టీ కార్యకర్త
నేడు మరో పార్టీ సమన్వయకర్త
రేపు నూతన పార్టీ సృష్టికర్త
1116 మినీ కవితా సంకలనం లో ప్రచురితమైన నా కవిత)
24-7-13.

Saturday 20 July 2013


కవి మిత్రులకు స్వాగతం
సమ్యైకాంధ్ర కవితలకు ఆహ్వానం


విజయవాడ కేంద్రంగా సమ్యైకాంధ్ర కోసం కృషి చేస్తున్న సమ్యైకాంధ్ర సాహితీ మిత్రులు సంస్థ తరపున సమ్యైకాంధ్ర కవితా సంకలనం తీసుకురావాలని సంకల్పించాం. కవులు తమ కవితలతో పాటు ఫోటోలను దిగువ చిరునామాకు పంపగలరు.


సమ్యైకాంధ్ర సాహితీ మిత్రులు
ఎస్.ఎఫ్.5, అనితా అపార్ట్ మెంట్స్
విద్యాధరపురం, విజయవాడ-12.
సెల్ : 93929 42485.



Wednesday 10 July 2013

diviki..

ప్రేమాభిమానాలకు ప్రతిరూపమైన మా నాన్నగారు కీ.శే. పాణిగ్రాహి రామకృష్ణ శర్మ గారు జూన్ 27వ తేదీ రాత్రి స్వర్గస్తులయ్యారు. మాకు చక్కని విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నతులుగా తీర్చిదిద్ది ప్రేమను పంచి మమ్మల్ని శోక సంద్రంలో ముంచి స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు.