Wednesday 28 May 2014

చాలా అలసిపోయాం..


హలో... బాగున్నారా... మేము ఏమి చేస్తున్నామని చూస్తున్నారా?..మరేమో మా బావ పెళ్ళికి మేమే పెద్దలం. అందుకే ఇలా పసుపు దంచుతున్నాం. ఇంతకీ మీకు రోకలి అంటే తెలుసా.. మా నాన్నమ్మ దాని గురించి చెప్పడమే కాక..ఇలా మాతోనే పెళ్లి పనులు చేయిస్తున్నారు..

చాలా అలసిపోయాం..నాకూ(నవ్య)..చిన్నగా ఉంది చూడండీ లక్కీకి తలో ఐస్ క్రీం ఇస్తారు కదూ...


Sunday 25 May 2014

సుజాత పుట్టినరోజు.

ఈరోజు నా అర్థాంగి సుజాత పుట్టినరోజు. ఆమెకు మీ శుభాకాంక్షలు అందజేస్తారు కదూ...

Tuesday 6 May 2014

అరే ఏమైందీ....

మనసు కవి ఆత్రేయ 


' అరే ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అని మనిషి తన మనసులో భావాలను చక్కనైన పాటగా కూర్చిన మనసు కవి అతడు. మంచుకురిసే వేళలో..మల్లేలిరిసేదెందుకో..అని ప్రియురాలు ప్రశ్నించినా..కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా..అని ప్రేమికుడు ఏడిపించినా.. అడగక ఇచ్చే మనసే ముద్దు...అని ప్రేమకు నిర్వచనం ఇచ్చినా.. చేతిలో చెయ్యేసి చెప్పు మావా...అని మరదలు ఒట్టేసినా..బూచోడమ్మ..బూచోడు..బుల్లిపెట్టెలో ఉన్నాడు.. అని మామ్మను మనవరాలు భయపెట్టినా.. అమ్మా చూడాలి..నిన్ను నాన్ననుచూడాలి అని పాపం పసివాడు ఏడ్చినా.. చిన్నారి పొన్నారి కిట్టయ్య..నిన్ను ఎవరు కొట్టారయ్యా..అని పిల్లాడి ఏడుపు ఆపినా... ఈ జీవన తరంగాలలో...ఆ దేవుని చదరంగంలో.. అంటూ... ఆ దివికేగిన మనసు కవి ఆచార్య ఆత్రేయ..తెలుగు సాహిత్యంలో ధృవతారగా నిలిచిఉంటారు. 

Sunday 4 May 2014

భవిష్యత్ ను మార్చుకుందాం.

మిత్రమా....ఓటు మన హక్కు..

అందరం ఓటు వేద్దాం
నిజాయితీ పరుడిని,నిస్వార్థపరుడైన నేతలను ఎన్నుకుందాం. మన భవిష్యత్ ను మార్చుకుందాం.
నేను ఓటు వేస్తా..మరిమీరో....  (poling Date7-5-2014 )


Saturday 3 May 2014

నవ్వు- నవ్వించు

నవ్వు- నవ్వించు


నేడు (4-5-14) ప్రపంచ నవ్వుల దినోత్సవం