అరే ఏమైందీ....
మనసు కవి ఆత్రేయ
' అరే ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అని మనిషి తన మనసులో భావాలను చక్కనైన పాటగా కూర్చిన మనసు కవి అతడు. మంచుకురిసే వేళలో..మల్లేలిరిసేదెందుకో..అని ప్రియురాలు ప్రశ్నించినా..కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా..అని ప్రేమికుడు ఏడిపించినా.. అడగక ఇచ్చే మనసే ముద్దు...అని ప్రేమకు నిర్వచనం ఇచ్చినా.. చేతిలో చెయ్యేసి చెప్పు మావా...అని మరదలు ఒట్టేసినా..బూచోడమ్మ..బూచోడు..బుల్లిపెట్టెలో ఉన్నాడు.. అని మామ్మను మనవరాలు భయపెట్టినా.. అమ్మా చూడాలి..నిన్ను నాన్ననుచూడాలి అని పాపం పసివాడు ఏడ్చినా.. చిన్నారి పొన్నారి కిట్టయ్య..నిన్ను ఎవరు కొట్టారయ్యా..అని పిల్లాడి ఏడుపు ఆపినా... ఈ జీవన తరంగాలలో...ఆ దేవుని చదరంగంలో.. అంటూ... ఆ దివికేగిన మనసు కవి ఆచార్య ఆత్రేయ..తెలుగు సాహిత్యంలో ధృవతారగా నిలిచిఉంటారు.
No comments:
Post a Comment