Friday 28 February 2014

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

మహా శివరాత్రి పర్వదినాన పార్వతీ దేవితో పరమశివుడి కల్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం విజయవాడలో గంగా సమేత దుర్గా మల్లేశ్వరుడు రథారూడుడై నగర పుర వీధుల్లో విహరించారు. భేతాళ నృత్యాలు, కోలాటం, లంబాడీ డ్యాన్స్, పులి,సింహం వేషధారుల ఆటలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలతో కెనాల్ రోడ్డు మారుమోగింది. నగర ప్రజలతో పాటు సమీప గ్రామాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. బొమ్మలు, తినుబండారాలు, బూరలు, ఐసులు, విక్రేతలతో జాతర వాతావరణం నెలకొంది.

Wednesday 26 February 2014

వెజిటెబుల్ శివ

వెజిటెబుల్ శివ

హాయ్ ఫ్రెండ్స్..మా అమ్మాయి నవ్యశ్రీ(2వ తరగతి), బాబు బాల శ్రీవత్స(3వ తరగతి) కలిసి చేసిన ఈ కూరగాయల లింగం ఎలా ఉంది..బాగుంది కదూ.. వారి సృజనాత్మకతకు వో లైక్ కొట్టేస్తారా మరి...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమ శివుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ..

Thursday 20 February 2014

Tuesday 11 February 2014

బుల్లిపెట్టెలో పోపు పెట్టి.



బ్లాగ్ పాఠకులకు చిన్న విన్నపము..

9-2-14న ఆంధ్రభూమి విజయవాడ సంచిక మెరుపులో నా కథ ప్రచురితమైంది. ఆ కథ స్కాన్ చేసి పెట్టాను. ఐతే చాలా మంది మిత్రులు అది చదివిందేకు వీలుగా లేదని నాకు తెలియజేయడంతో పూర్తి కథను పెడుతున్నాను.. నా మా ఇంటి తంటా కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తారు కదూ...
ఇంతకీ కథాంశం ఏమిటో తెలుసా... అదేనండీ బుల్లిపెట్టెలో పోపు పెట్టి..మీ ఇంటి వంటా..అంటారే..అదే..మరి నా కథలో కథానాయకుడి తంటాలేమిటో తెలుసుకోండిక..

Saturday 8 February 2014

మా ఇంటి తంటా

ఈ రోజు (9-2-14)విజయవాడ అంధ్రభూమి మెరుపు లో నా కథ మా ఇంటి తంటా కథ ప్రచురితమైంది. వీలు చేసుకొని,వీలు చూసుకొని నా కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్తారు కదూ...

Monday 3 February 2014

నా మదిలో

ఓ చెలీ అదరాలు అలా పెట్టమాకు...
నా మదిలో ఆశలు చిగురించమాకు..

పాణిగ్రాహి రాజశేఖర్ 3-2-14