Friday, 28 February 2014

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

మహా శివరాత్రి పర్వదినాన పార్వతీ దేవితో పరమశివుడి కల్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం విజయవాడలో గంగా సమేత దుర్గా మల్లేశ్వరుడు రథారూడుడై నగర పుర వీధుల్లో విహరించారు. భేతాళ నృత్యాలు, కోలాటం, లంబాడీ డ్యాన్స్, పులి,సింహం వేషధారుల ఆటలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలతో కెనాల్ రోడ్డు మారుమోగింది. నగర ప్రజలతో పాటు సమీప గ్రామాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. బొమ్మలు, తినుబండారాలు, బూరలు, ఐసులు, విక్రేతలతో జాతర వాతావరణం నెలకొంది.

No comments:

Post a Comment