వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలన్నట్టు ......
వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లిచేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు ... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నాతల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకురమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో పడ్డారు. కానీ పార్వతిలాంటి అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పటినించి ఈ సామెత పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదిరవుతుంటే "వినయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారయింది పరిస్థితి" అనడం రివాజుగా మారింది.
సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది......
సాక్షి ఆదివారం పుస్తకం నుంచి సేకరించడమైనది......
No comments:
Post a Comment