బాల్యం
గుర్తుకొస్తున్నాయి
చిన్నప్పుడు ఆముదపు దీపం గుడ్డివెలుతురులో
అమ్మ దిద్దించిన ఓనమాలు
అ ఆలు రాలేదని ఇసుకలో రాయించిన శిక్షలు
పాఠశాలకు వెళ్ళనని మారం చేస్తే తాయిలంగా ఇచ్చిన పప్పుండలు
అక్క చేసి ఇచ్చిన కాగితపు ఫ్యాన్లుతో
పొలం గట్లపై పరుగులు
నాని గాడు, సూరి గాడితో ఆడిన గోలీలాటలు
గౌరమ్మ జాతరలో రంగులరాట్నం ఎక్కి నేను చేసిన హాహాకారాలు
తెలుగు పద్యాలు చెప్పలేదని వేసిన గోడ కుర్చీలు
నాన్న తెచ్చిన పీసు మిఠాయి కోసం అక్కతో చేసిన ఫైటింగులు
కొత్త బట్టల కోసం అటకెక్కిన అలకలు
గోమాత దూరమైనప్పుడు నాన్న కంటి నుంచి రాలిన కన్నీటి చుక్కలు
ఎవరూ చూడకుండా మామ్మ దాచి ఇచ్చిన పిప్పర్ మెంట్ బిళ్ళలు
బాల్యపు స్మ్రుతులు
వెంటాడె తీపి గుర్తులు
No comments:
Post a Comment