Monday, 29 April 2013


అమ్మో..ఆడపిల్లా..


ఒకప్పడు..
ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అన్నారు
పనిపాటల్లో ప్రథమురాలిగా నిలుస్తుందన్నారు
చదువుల్ల్లో సరస్వతికి మారుపేరన్నారు
ప్రేమాప్యాతలకు ప్రతిరూపమన్నరు
అమ్మాయున్న ఇల్లు సిరి సంపదలకు నెలవన్నారు
మరిప్పుడు..

పాకే వయస్సులోనే పాడు చూపులతో వేటగాళ్ల వలలు
పరిగెత్తే వేళ కిడ్నాపర్ల చెరలు
బడికెళ్లే దారిలో బంగారం కోసం కిరాతక హత్యలు
హైస్కూల్ దశలోనే ప్రేమ అంటూ వెంటపడే పోకిరీలు
కాలేజిలో మాస్టార్ల కామ కలాపాలు
రోడ్డెక్కితే వెధవల రోతపు మాటలు
తోడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితులు
నిమిషానికో లైంగిక దాడి
గంటకో గ్యాంగ్ రేప్
ఆడపిల్లను ఎలా కాపాడేది..
ఆమెకు రక్షణ ఎలా ఇచ్చేది..
ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా..
కొనసాగుతునే ఉన్నాయి అత్యాచారాలు..
ఆడ వాసన రుచి మరిగిన మనవ మృగాల వనంలో
నేను వదలలేను నా లేడి కూనను
కళ్ళప్పగించి చూస్తూ ఉండలేను...
అమ్మో ఆడపిల్ల అనకుండా వుండలేను..











No comments:

Post a Comment