Wednesday, 10 April 2013


విజయోస్తు!!


నందనం కాలేదు ఆనందవందనం

శ్రీకాకుళంలో థర్మల్ పోరాటం
అమాయక జనంపై పోలీస్ ప్రతాపం
అన్నదాతను నట్టేట ముంచిన వైనం
ఇంకా అందని నష్టపరిహారం
విలయాలు, ప్రళయాలు, విష్పోటనలతో కకావికలందొమ్మీలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలతో
నందనం అంతా విషాదం
నిర్దయగా నిర్భయపై మానవ మృగాల అకృత్యం
దేశానికే తెచ్చెను కలంకం
నైతిక విలువలు మృగ్యం
నిత్యం యాత్రింక జీవనం
దిగజారుతున్న మనావ సంబంధ భాంధవ్యం
ఫేస్ బుక్కే సర్వస్వం
అటకెక్కిన పుస్తకం
అంతర్జాల మాయా ప్రపంచం
సైబర్ నేరాలతో బురిడి కొట్టిస్తున్న వైనం
ప్రాంతీయవాదంతో రాష్త్ట్రం అగ్నిగుండం
రాజకీయ అనిశ్శితతో అభివృద్ధి అమదదూరం
ప్రపంచ మహాసభలతో తెలుగుకు పట్టం
ప్రదర్శనలు, సదస్సులతో పెరిగిన భాషా చైతన్యం
రాజధానిలో బాంబు పేలుళ్ళ బీభత్సం
అమయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రభూతం
నందనం కాలేదు ఆనంద వందనం
విజయానికి సంకేతం కావాలి "విజయ" వత్సరం
విజయనామ ఉగాదిని స్వాగతిద్దాం
విజయోస్తు!! ద్విగ్విజయోస్తు!! అని ఆశీర్వదిద్దాం


No comments:

Post a Comment