అక్షరం
అక్షరం నా నేస్తం
నాతోనే కలిసుంటుంది ప్రతిక్షణం
నా ఊహలతో ఊసులాడుతుంది
ఆలోచనలను ఆవిష్కరిస్తుంది
అనుభవాలను పంచుకుంటుంది
హృదయ వీణను మీటుతుంది
ఆత్మ ఘోషను ఆలకిస్తుంది
ఒంటరితనాన్ని దూరం చేస్తుంది
నీకు నేనున్నానంటూ అండగా నిలుస్తోంది
అందుకే అక్షరం అంటే నాకిష్టం
అది లేకుండా బతకడం కష్టం
5-5-13. పాణిగ్రాహి రాజశేఖర్.
No comments:
Post a Comment