ఆమే..నేను
ఆమె నాలో సగం
కాదు..కాదు..
నేనే ఆమె..ఆమే నేను..
నా ఆలోచనలకు ఊపిరిపోస్తుంది
నా అక్షరాలకు రూపమిస్తుంది
నా కవితలకు తొలి పాఠకురాలవుతుంది
నా అదుగుజాడే ఆమెకు వెలుగునీడ
అడుగుతడబడకుండా వెన్నంటే ఉంటుది తోడునీడగా..
అనురాగ ప్రియరాగాలు ఆలపిస్తోంది
నా మాటల తూటాల గాయాలనూ మౌనంగా భరిస్తోంది
నా కోపాగ్నిపై ప్రేమ జల్లులు కురిపిస్తోంది..
నా విరహం తట్టుకోలేనంటుంది..
నేనే తన ప్రాణమంటుంది..
ఆమె కోసం నేను... నా కోసం ఆమె..
(ఈ రోజు నా శ్రీమతి సుజాత జన్మదినోత్సవం సందర్భంగా)
No comments:
Post a Comment