పథకం - పతనం
అమ్మ హస్తం, అభయ హస్తం
పేదోడికి రిక్తహస్తం
"ఇందిరమ్మ" ఇంతేనమ్మా
"ఉపాధి" ఉత్తిదేనమ్మా
"ఇందిరమ్మ కలలు" కల్లలేనమ్మా
"పచ్చ తోరణం" కట్టలేదమ్మా
రాజీవ్ యువ కిరణం
అంతా ప్రచార ఆర్భాటం
యువతకు ఉద్యోగం
గగన కుసుమం
ప్రచారానికి కోట్లకు కోట్లు
సంక్షేమానికి లక్షల్లోనే కేటాయింపులు
పల్లేల్లో దాహం కేకలు
పట్టించుకోని పాలకులు
వస్తున్నాయి ఎన్నికలు
నాయకులను పక్కన పెడదాం
సేవకులను ఎన్నుకుందాం
No comments:
Post a Comment