అమ్మా..వందనమమ్మా...
నవమాసాలు మోసింది
పేగు బంధం పంచింది
చనుబాలమృతం పట్టింది
బొసి నవ్వులకు మురిసింది
జోలపాటలతో జోకొట్టింది
గోరుముద్దలతో తీపి ముద్దులు ఇచ్చింది
తన కాళ్లే ఊయలగా మార్చింది
బుడి బుడి అదుగులు తడబకుందా ఊతకర్రైంది
పాడు కళ్ళు పడకూడదని దిష్టి తీసింది
ఎదిగేకొద్ది ఒదిగి ఉండమని హితులెన్నో చెప్పింది
ధైర్య సాహసాలు ఆభరణమంది
ఆధ్యాత్మిక చింతన అవసరమంది
నైతిక విలువలు నేర్పింది
బతుకు సమరంలో విజేతవు కావాలని
అక్షరాయుధాన్ని వరంగా ఇచ్చింది
ప్రేమతో అనురాగ సాగరంలో ఓలలాడించింది
అన్నీ ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియదంది
నా వృద్ధినే కోరింది
అభివృద్ధికి బాటలు వేసింది
మా మమతల కోవెలలో అనురాగ దేవత అమ్మ
కనిపించే దైవం అమ్మ
(ఈ రోజు మాతృ దినోత్స
వం సంధర్భంగా)
పాణిగ్రాహి రాజశేఖర్ (12-5-13)
No comments:
Post a Comment