అక్షర పండగ
ఈ రోజు నేను సాహితీ క్షేత్రంలో విహరించాను. అక్షర సుగంధ పరిమళాలతో నా మది పులకించింది. విజ్ఞానం, వినోదం, విద్య, సాహిత్య తేజో మూర్తులు, అపురూప చిత్రాలు, సాంకేతిక సీడీలు, మరెన్నో అక్షర సుమాలు...అన్నీ ఒకేచోట. అదేనండి మా విజయవాడలో జరుగుతున్న పుస్తకాల పండుగకి నేనూ వెళ్ళాను. ఎన్నో అలనాటి మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు వున్నాయి. పిల్లలకు నీతి కథలతో పాటు చిత్రలేఖనం పుస్తకాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. పాత కథలు, పాత సంచికలు సాహితీ ప్రియుల మనసుదోచుకుంటాన్నాయి. వీటికి తోడు పుస్తకావిష్కరణలు, సమీక్షలు, పరిచయసభలు, ప్రముఖుల ఉపన్యాసాలతో అక్షర ప్రేమికులకు నిత్యం సాహితీ విందు. మరి మా పుస్తకాల పండుగకి మీకు కూడా స్వాగతం...సుస్వాగతం... జనవరి 12 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
No comments:
Post a Comment