Friday 14 November 2014

పని పిల్లలం..పసి మొగ్గలం..

పని పిల్లలం..పసి మొగ్గలం..

పిల్లలం..పిల్లలం..
బడి ఈడు బాలలం..
పలకా బలపం ఎరుగం..
పని పాటలే ప్రతినిత్యం..
యూనిఫారాల హంగులు లేవు..
మాసిన బొత్తాలు లేని చొక్కాలు తప్ప..
పాలిష్ షూల తళకులు లేవు...
అరిగిన హవాయి చెప్పులే రక్ష
ఫేస్ పౌడర్ల పై పూతలు లేవు..
దుమ్ము,ధూళి, మసి మరకలే మా సౌందర్య సాధనాలు
బిస్కేట్లు, చాక్లేట్లు, బర్గర్లు, పిజ్జాల రుచులు తెలియవు..
మిగిలిన పాచి బన్ను ముక్కలే కేకులు
లంచ్ బాక్సులో బిర్యానీలు లేవు..
విస్తరాకుల్లో ఎంగిలి మెతుకులే కిచిడీలు మాకు...
బడి పిలుస్తోంది రా.... అంటారు..
నీకు ఈ ఒక్కరోజు అదృష్టమే చాలంటారు..
బాలల దినోత్సవాలు లేవు..
ఆ సంబరాలలో బ్యానర్లు మోసే భావి భారత కార్మికులం..
చాచాజీ జయంతి వేడుకల్లో ఛాయ్ లు అందించే చోటూలం..
పసిమొగ్గలం మేం..
పనిపిల్లలం మేం..
విధాత గీసిన గీత..
ఎన్నేళ్లైనా మారదా మా తల రాత...

- పాణిగ్రాహి రాజశేఖర్





No comments:

Post a Comment