దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి..?
గుడికి బైలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక,బైలుదేరేముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడిబైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి, పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవడానికి, తొలుత రెండు కళ్ళు వెనక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడుసార్లు పుక్కిలించి నీటిని బైటకు వదలాలి.
"దేవా| శరీరమూ, వాక్కుకి మూలకారకమైన నాలుకా, నోరూ కూడా శుభ్రపరుచుకొని నీ ముందు వచ్చి ప్రార్ధిస్తున్నాము. కావున మమ్ము దీవించు" అని అర్ధం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు, నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.
No comments:
Post a Comment