నాగరాజులకు...కోపమొచ్చింది..
నాగరాజులకు కోపమొచ్చింది. నాగుల చవితికి జనాల దగ్గర డబ్బులు లేకుండా చేసి తమ పుట్టల్లో పాలు పోయకపోవడానికి నేతలే కారణమని తెలుసుకున్నాయి. పెరిగిన ధరలు, విభజన సెగలు, ప్రకృతి విలయాలు, రైతన్నలకు కడగండ్లు,ఈ పాపాలకూ వారే కారణమని తెలుసుకున్నాయి. పగ పెంచుకున్నాయి. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని మీడియా ద్వారా వాటికి సమాచారమందింది. అంతే..తమ పరివారాలతో సహా.. అసెంబ్లీ లోకి చేరిపోయాయి. తాము వచ్చామని టీవీ వాళ్లకి చెప్పడంతో కెమేరాలతో అంతా వాలిపోయారు. పొద్దునుంచి ఒకటే పబ్లిసిటీ.. ఇక నేతలూ కాసుకోండి..
ఇప్పటికే నన్నపనేని వీటి రాక వెనక ఎవరి 'హస్తం' ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక రానున్న సమావేశాల్లో నేతల చేతుల్లో మైకు గొట్టాల బదులు పాములుంటాయోమో..వేచి చూద్దాం... పాము కాటుకు నేతల మృతి వార్తల కోసం...

No comments:
Post a Comment