Saturday, 30 November 2013

దేవాలయంలో కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి..?


దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి..?


   
    గుడికి బైలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక,బైలుదేరేముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడిబైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి, పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవడానికి, తొలుత రెండు కళ్ళు వెనక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడుసార్లు పుక్కిలించి నీటిని బైటకు వదలాలి.
      "దేవా| శరీరమూ, వాక్కుకి మూలకారకమైన నాలుకా, నోరూ కూడా శుభ్రపరుచుకొని నీ ముందు వచ్చి ప్రార్ధిస్తున్నాము. కావున మమ్ము దీవించు"  అని అర్ధం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు, నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.

Wednesday, 27 November 2013

నాగరాజులకు...కోపమొచ్చింది..

 నాగరాజులకు...కోపమొచ్చింది..


నాగరాజులకు కోపమొచ్చింది. నాగుల చవితికి జనాల దగ్గర డబ్బులు లేకుండా చేసి తమ పుట్టల్లో పాలు పోయకపోవడానికి నేతలే కారణమని తెలుసుకున్నాయి. పెరిగిన ధరలు, విభజన సెగలు, ప్రకృతి విలయాలు, రైతన్నలకు కడగండ్లు,ఈ పాపాలకూ వారే కారణమని తెలుసుకున్నాయి. పగ పెంచుకున్నాయి. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని మీడియా ద్వారా వాటికి సమాచారమందింది. అంతే..తమ పరివారాలతో సహా.. అసెంబ్లీ లోకి చేరిపోయాయి. తాము వచ్చామని టీవీ వాళ్లకి చెప్పడంతో కెమేరాలతో అంతా వాలిపోయారు. పొద్దునుంచి ఒకటే పబ్లిసిటీ.. ఇక నేతలూ కాసుకోండి..
ఇప్పటికే నన్నపనేని వీటి రాక వెనక ఎవరి 'హస్తం' ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక రానున్న సమావేశాల్లో నేతల చేతుల్లో మైకు గొట్టాల బదులు పాములుంటాయోమో..వేచి చూద్దాం... పాము కాటుకు నేతల మృతి వార్తల కోసం...
 




Tuesday, 26 November 2013

నీ కోసం...

నీ కోసం...




ఈ ముగ్దమనోహర రూపం
అప్సరసలకే ధీటైన అందం

Sweet Dreams

Good Night 

Happy Wedding Anniversary

Happy Wedding Anniversary 


వేలూరి సుధారాణి, కౌండిన్య లకు 

పెళ్లిరోజు శుభాకాంక్షలు...

Monday, 25 November 2013

వంకాయ పెంగ్విన్..

వంకాయ పెంగ్విన్..
బాగుంది కదూ..

శాఖాహార దినోత్సవ శుభాకాంక్షలు


Tuesday, 19 November 2013

నీ ప్రేమ...

నీ ప్రేమ పూలవానతో పులకింత..నీ ఊహలే నా మనసంతా  


@ పాణిగ్రాహి..20-11-13.


Good Night

Good Night



ఈ రోజు మనదేరా..

ఈ రోజు మనదేరా..

గట్టి"మేల్" తలపెట్టవోయ్..

Saturday, 16 November 2013

Thursday, 14 November 2013

నీ చూపు తీక్షణం..నా పై వేయకు వలపు బాణం...


Tuesday, 12 November 2013


Good night..

A bed of clouds for U to sleep,
Diamond stars as ur bed side lamp,
Angels from heaven singing lullabies for U,
May usleep peacefully, Good night..


ఔరా...ఈ విన్యాసం..


తాళ్ల సహాయంతో గాలిలో ఎగురుతూ అమ్మాయిలు చేసే అబ్బుర విన్యాసాలు..గజరాజు,కోతిల ఆటలు, జోకర్ నవ్వులు,ఆశ్చర్యపరిచే ఫీట్లు,నిప్పుతో చెలగాటాలు,ఒళ్లు గగుర్పరిచే విన్యాసాలు.. ఇంకా ఎన్నో వింతలతో జమున సర్కస్ విజయవాడ నగర ప్రజలను ఆకట్టుకుంటుంది. మన చిన్నతనంలో సర్కస్ కి వెళ్లడమంటే పెద్ద పండుగే. నిప్పుల చట్రంలో నుంచి సింహం దూకుతుంటే భయంతో అమ్మ ఒళ్లొ తల పెట్టుకునేవాడిని. డాడి ముందు కుర్చిల్లో కూర్చుందామంటే..నేను మాత్రం గ్యాలరీ కావాలని గారాం చేసేవాన్ని. అక్కడైతే జంతువులకు దూరంగా వుండవచ్చని. ముక్కుకు ఎర్రటి కాయ పెట్టుకొని బఫూన్ చేసే అల్లరి నాకు ఎంతగానో నచ్చేది. మారుతున్న సాంకేతిక విజ్ఞానంతో ఎంతో ప్రగతి సాధించాం. అంతర్జాలం లో ప్రపంచం నలుమూలలు జరిగే వింతలు చిటికెలో ప్రత్యక్షమైతున్నాయి. కాని నేటికీ బొంబే సర్కస్, జెమిని సర్కస్, జమున సర్కస్, ఇంకా అనేక కంపెనీలు దేశం నలుమూలలా ప్రదర్శనలు ఇస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గతంలో ఉన్న ఆదరణ తగ్గినప్పటికీ సర్కస్ పేరు వినగానే చిన్నతనం గుర్తుల దొంతరలు అలా కదలాడుతునే ఉంటాయి. బెజవాడలో మళ్ళీ సర్కస్ రావడం ఎంతో ఆనందంగా ఉంది.

Monday, 11 November 2013

నేత్రపర్వం కార్తీక దీపోత్సవం


కార్తీక సోమవారం సందర్భంగా విజయవాడలోని శివాలయంలో ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించారు. 

కవిత

మైమరిపించే నీ నాట్య భంగిమ
నా హృదయవీణ పలికెను సరిగమ



నీ నాట్య విన్యాసం
నాలో పెంచెను తాపం


Sunday, 10 November 2013

అందానికి నిర్వచనం
యువతకు ఆరాధ్యదైవం

Wednesday, 6 November 2013