Tuesday, 30 April 2013
కడుపు కోతలు
పొలాల్లో యంత్రాలతో కోతలు
కూలీలకు ఆకలి మంటలు
ఖార్ఖానాల్లో కరెంటు కోతలు
కార్మికుల వేతనాల్లో కోతలు
ఉపాధి పనుల్లో అవినీతి మేట్లు
శ్రమజీవుల కూలి డబ్బుల్లో ఆమ్యామ్యాలు
మూతపడుతున్న పరిశ్రమలు
రోడ్డునపడుతున్న ఉద్యోగులు
ఎన్ని మేడేలు వచ్చినా
కార్మిక కుటుంబాల్లో ప్రసరించని వెలుగులు
ఉత్సవం వద్దు...పేదోడి కడుపు నింపు..
(కార్మిక దేవుడికి ఇదే నా అక్షరాంజలి)
పాణిగ్రాహి రాజశేఖర్ (30-4-13, 11.13 పి.ఎం.)
Monday, 29 April 2013
అమ్మో..ఆడపిల్లా..
ఒకప్పడు..
ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అన్నారు
పనిపాటల్లో ప్రథమురాలిగా నిలుస్తుందన్నారు
చదువుల్ల్లో సరస్వతికి మారుపేరన్నారు
ప్రేమాప్యాతలకు ప్రతిరూపమన్నరు
అమ్మాయున్న ఇల్లు సిరి సంపదలకు నెలవన్నారు
మరిప్పుడు..
పాకే వయస్సులోనే పాడు చూపులతో వేటగాళ్ల వలలు
పరిగెత్తే వేళ కిడ్నాపర్ల చెరలు
బడికెళ్లే దారిలో బంగారం కోసం కిరాతక హత్యలు
హైస్కూల్ దశలోనే ప్రేమ అంటూ వెంటపడే పోకిరీలు
కాలేజిలో మాస్టార్ల కామ కలాపాలు
రోడ్డెక్కితే వెధవల రోతపు మాటలు
తోడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితులు
నిమిషానికో లైంగిక దాడి
గంటకో గ్యాంగ్ రేప్
ఆడపిల్లను ఎలా కాపాడేది..
ఆమెకు రక్షణ ఎలా ఇచ్చేది..
ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా..
కొనసాగుతునే ఉన్నాయి అత్యాచారాలు..
ఆడ వాసన రుచి మరిగిన మనవ మృగాల వనంలో
నేను వదలలేను నా లేడి కూనను
కళ్ళప్పగించి చూస్తూ ఉండలేను...
అమ్మో ఆడపిల్ల అనకుండా వుండలేను..
Wednesday, 17 April 2013
Thursday, 11 April 2013
Wednesday, 10 April 2013
Saturday, 6 April 2013
బాల్యం
గుర్తుకొస్తున్నాయి
చిన్నప్పుడు ఆముదపు దీపం గుడ్డివెలుతురులో
అమ్మ దిద్దించిన ఓనమాలు
అ ఆలు రాలేదని ఇసుకలో రాయించిన శిక్షలు
పాఠశాలకు వెళ్ళనని మారం చేస్తే తాయిలంగా ఇచ్చిన పప్పుండలు
అక్క చేసి ఇచ్చిన కాగితపు ఫ్యాన్లుతో
పొలం గట్లపై పరుగులు
నాని గాడు, సూరి గాడితో ఆడిన గోలీలాటలు
గౌరమ్మ జాతరలో రంగులరాట్నం ఎక్కి నేను చేసిన హాహాకారాలు
తెలుగు పద్యాలు చెప్పలేదని వేసిన గోడ కుర్చీలు
నాన్న తెచ్చిన పీసు మిఠాయి కోసం అక్కతో చేసిన ఫైటింగులు
కొత్త బట్టల కోసం అటకెక్కిన అలకలు
గోమాత దూరమైనప్పుడు నాన్న కంటి నుంచి రాలిన కన్నీటి చుక్కలు
ఎవరూ చూడకుండా మామ్మ దాచి ఇచ్చిన పిప్పర్ మెంట్ బిళ్ళలు
బాల్యపు స్మ్రుతులు
వెంటాడె తీపి గుర్తులు
Wednesday, 3 April 2013
Subscribe to:
Posts (Atom)