తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకు ఉంటాయి ?
తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు తెలిసే ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి. ఆ భంగిమకు అర్ధం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు, దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్ధం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈ సారి తిరుమల వెళ్ళినపుడు స్వామి వారిని ఆపాదమస్తకమూ తనివితీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి.
No comments:
Post a Comment