Sunday, 29 December 2013

భగవద్గీత శ్లోకాల పోటీలో ద్వితీయ బహుమతి

భగవద్గీత శ్లోకాల పోటీలో ద్వితీయ బహుమతి


చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. 29-12-13 విజయవాడ కేబీఎన్ కళాశాలలో జరిగిన సభలో బహుమతితోపాటు సర్టిఫికెట్ అందుకుంటున్నప్పటి దృశ్యం.

పాణీలు-6


పాణీలు-6

నాడు చిన్నారి చేతిలో స్లేట్నేడు బుజ్జాయి పట్టుకున్నాడు టాబ్లెట్..


ఆవిడ కంటతడి ఆరడం లేదుతెలుగు సీరియల్ నటి మరి...


పాణిగ్రాహి రాజశేఖర్, 29-12-13

Friday, 27 December 2013

పాణీలు-5

పాణీలు-5


ఆ పిల్లలు బుక్ వదలడం లేదు
అవును ఎఫ్ బి దెయ్యం పట్టింది



ఆ కాలేజీలకే ర్యాంకుల పంట..
అవన్నీ కోతలేనంట...
విద్యార్థినుల ఆత్మహత్యలతో
తల్లిదండ్రులకు కడుపుకోతలే మిగిలేనంట..


పాణిగ్రాహి రాజశేఖర్
28-12-13



Thursday, 26 December 2013

పాణీలు-4


పాణీలు-4


1. పల్లేలకూ పాకిన సూపర్ మార్ట్ లుకిరణా దుకాణాలకు తాళాలు



2. వ్యవసాయ సీజన్ మొదలుకూలీలకు చేతినిండా పనులుకాంట్రాక్టర్ కు కాసుల పంటలు


27-12-13 పాణిగ్రాహి రాజశేఖర్

Wednesday, 25 December 2013

పాణీలు - 3 (నానీలు )

పాణీలు - 3 (నానీలు )

జనారణ్యంలో
పక్షుల కువకువలు..
బ్యాటరీ బొమ్మల
రాగాలు మరి...



క్యాబరే డాన్సర్లకు
డిమాండ్ తగ్గింది...
ఐటంసాంగ్ ల
ఎఫెక్ట్ మరి...



- పాణిగ్రాహి రాజశేఖర్

Monday, 23 December 2013

పాణీలు -2 ( నానీలు )


పాణీలు -2 ( నానీలు )



వాడికి సెల్ పిచ్చి పట్టింది భోజనానికి పిలవాలన్నా...మెసేజ్ ఇవ్వాల్సిందే.. !

అన్నప్రాసన రోజే ఆల్ఫాబేటాలు చెప్పాడు...అక్షరాభ్యాసం నాటికి విద్యాభ్యాసం పూర్తయింది...హైటెక్ స్టూడెంట్ మరి..


ఆ పాప పుడుతూనేమాం.. మాం.. అంటుంది..ఇంగ్లీష్ మందుల ప్రభావం మరి..




పాణిగ్రాహి రాజశేఖర్

23-12-2013

Tuesday, 17 December 2013

పాణీలు( నానీలు)


పాణీలు( నానీలు)



ఆ ఇంట్లో అందరూ ఇంజనీర్లే...
అయినా గంజినీళ్ళూ  కరువే...




*******

వాడికి గూగుల్ భూతం పట్టింది
అత్తగారింటికి రూట్ మ్యాప్ వెతుక్కుంటున్నాడు..

Saturday, 14 December 2013

బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు

బాపు గీత

చక్కటి గిలిగింత
నవరసాల రూపకర్త
భావ చిత్రాల సృష్తికర్త

బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు


Thursday, 12 December 2013

బ్లాగ్ పాఠకులకు మనవి

బ్లాగ్ పాఠకులకు మనవి


నాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక, భక్తి సంభందిత విషయాలను పలు పత్రికల్లో చదివి తెలుసుకున్నాను. ఎంతో విలువైన సమాచారం  నలుగురికీ తెలియజేయాలనే సదుద్దేశంతోనే వీటిని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. అంతేగాని వేరే వాళ్ళవి కాపీ కొట్టడం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే నాకు మెయిల్ చేయండి. ఆ పోస్ట్ తొలగిస్తాను. నేను పెట్టే ఈ సమాచారం అంతా ఫేస్ బుక్, ఆధ్యాత్మిక పత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.. ఇకపై ఎక్కడ నుంచి సేకరించానో కూడా కింద ఉదహరిస్తాను. నా బ్లాగ్ రచనలను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి.


మీ స్పందనను తప్పక తెలియజేస్తారు కదూ..

ధన్యవాదములతో...

విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు...

బలపం పట్టి భామ ఒళ్ళో
అ ఆ ఇ ఈ లు దిద్దాడు...
తైలం పెట్టి తాళం పట్టి
తలంటులూ పెట్టాడు...
"ధర్మక్షేత్రం"లో "శత్రువు"లపై
"జయం మనదేరా" అన్నాడు...
"నువ్వు నాకు నచ్చావ్"
"ప్రేమించుకుందాం రా...
మనది"పవిత్రబంధం" అంటూనే
ఈ "అబ్బాయిగారు"
"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" తో
సరసాలాడాడు..
"ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అని
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"కింద సేదతీరాడు.


 విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు...

లక్కీ బాయ్..

లక్కీ బాయ్..


ఈ అబ్బాయి చాలా ముద్దుస్తున్నాడు కదా...అందుకే ఈ పిక్ పోస్ట్ చేశాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే...
11-12-13 అదృష్ట రోజున మా మేనకోడలు ఎన్.శాంతి శ్రీ ఈ బుడతడికి జన్మనిచ్చింది. మరి వాడు ఎంతటి మేధావి అవుతాడో వేచిచూడాల్సిందే.. ఇంకో విషయం...వీడు సామాన్యుడు కాదండీ...పుట్టినరోజే పేపర్ లో వాడి ఫోటో వేయించుకున్నాడు. మరి ఆ చిన్నోడికి హాయ్..చెప్తారు కదూ... బై....


Wednesday, 11 December 2013

తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకు ఉంటాయి ?

తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకు ఉంటాయి ?

         తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు తెలిసే ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి. ఆ భంగిమకు అర్ధం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు, దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్ధం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈ సారి  తిరుమల వెళ్ళినపుడు స్వామి వారిని ఆపాదమస్తకమూ తనివితీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి.

Sunday, 8 December 2013

వెంకటేశ్వర స్వామికి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు?

వెంకటేశ్వర స్వామికి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు?


శివ లింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు?

శివ లింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు?


శివునికి నిత్యపూజ జరగాల్సిందే. అలా చేయగలిగితేనే లింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివ లింగానికి నిత్యం ఖచ్చితమైన సమయంలో అభిషేకము, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు. కావున శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్యలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురికావటం కన్నా, మీకు దగ్గరలోని గుడి శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది,

Saturday, 7 December 2013

ధర్మవరపు సుబ్రమణ్యం గారు ఇక లేరు.

ధర్మవరపు సుబ్రమణ్యం గారు ఇక లేరు.

మమ్ములను దుఖసాగరంలో  ముంచి మీరు పరలోక సాన్నిధ్యం చెరుకున్నారా..
మీరు లేరనేబాధ మమ్మల్ని ఎంతగానో కలచివేస్తుంది..
మీకు ఇవే మా అశృనివాళి..

స్నేహమంటే...

స్నేహమంటే...



Friday, 6 December 2013

భజ గోవిందం

భజ గోవిందం


సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వతే జీవన్ముక్తి:







Thursday, 5 December 2013

దేవాలయపు వెనుక భాగాన్ని ఎందుకు తాకరాదు ?

దేవాలయపు వెనుక భాగాన్ని ఎందుకు తాకరాదు ?

      చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు.
      ఆ భాగంలో రాక్షసులుంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి.

Wednesday, 4 December 2013

భగవద్గీతలో చిన్నారి ప్రతిభ......

చిన్మయమిషన్ నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్త పోటీల్లో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ(2వ తరగతి) ద్వితీయస్థానం సాధించింది. గురువారం (5-12-13) ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, ప్రజాశక్తి దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పింగ్స్



Tuesday, 3 December 2013

చిన్నారి నవ్యశ్రీ ప్రతిభ

చిన్నారి నవ్యశ్రీ  ప్రతిభ


చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్నప్పటి నుంచే వివిధ శతకాలు, శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపిస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు అలవడాలనే ఉద్దేశ్యంతో మా అమ్మాయి నవ్యశ్రీతో పాటు బాబు బాలశ్రీవత్సకు భగవద్గీత, శతకాలు నేర్పుతున్నాం. మీ పిల్లలకూ ఆధ్యాత్మిక సువాసనలు రుచి చూపిస్తారు కదూ.. మా పిల్లలకు మీ ఆశ్శీసులు అందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ....

Monday, 2 December 2013

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం



సర్వ అవయువాలున్నా..బుద్ధి వికాసం లేనప్పుడు..వికలాంగత్వం ఉన్నా..

తమ ప్రత్యేకత చాటుతున్న వారందరికీ జయహో..





శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?

శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?

     శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు. అయినా తోక నిమిరితే ఎంతో ఆనందము. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ఎద్దు ధర్మానికీ, గుర్రం శక్తికీ ప్రతీకలు.
      ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరటంలో భాగం.