Sunday, 16 March 2014

vana devatha

my daughter navyasri participated in school fancy dress competition. she participated as a VANA DEVATHA and she won the Third Prize on 50 participants. dear collegues and frinds bless my daughter.

Friday, 28 February 2014

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

నయన మనోహరం - దుర్గామల్లేశ్వర విహారం

మహా శివరాత్రి పర్వదినాన పార్వతీ దేవితో పరమశివుడి కల్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం విజయవాడలో గంగా సమేత దుర్గా మల్లేశ్వరుడు రథారూడుడై నగర పుర వీధుల్లో విహరించారు. భేతాళ నృత్యాలు, కోలాటం, లంబాడీ డ్యాన్స్, పులి,సింహం వేషధారుల ఆటలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలతో కెనాల్ రోడ్డు మారుమోగింది. నగర ప్రజలతో పాటు సమీప గ్రామాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. బొమ్మలు, తినుబండారాలు, బూరలు, ఐసులు, విక్రేతలతో జాతర వాతావరణం నెలకొంది.

Wednesday, 26 February 2014

వెజిటెబుల్ శివ

వెజిటెబుల్ శివ

హాయ్ ఫ్రెండ్స్..మా అమ్మాయి నవ్యశ్రీ(2వ తరగతి), బాబు బాల శ్రీవత్స(3వ తరగతి) కలిసి చేసిన ఈ కూరగాయల లింగం ఎలా ఉంది..బాగుంది కదూ.. వారి సృజనాత్మకతకు వో లైక్ కొట్టేస్తారా మరి...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమ శివుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ..