దుర్గగుడి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా నివాసాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పై వంతెన నిర్మాణంతో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అయితే అశోక్ స్తంభం, పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలను తొలగించడం నాకు చాలా బాధగా వుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా లాండ్ మార్క్ గా ఉన్న అశోక్ స్తంభం అదృశ్యం అయింది. ఇళ్ళతో పాటు పదుల సంఖ్యలో రోడ్డు పక్కన వున్న భారీ వృక్షాలు నేలకూలుస్తుంటే నా కంట కన్నీళ్ళు ఉబికాయి. నదీ తీరంలో ఉన్న పచ్చని చెట్టుల గాలి ఇక మాకు కరువైనట్లే. ఏదైనా అభివృద్ధి జరగాలంటే.. కొన్ని వదులుకూవాల్సిందే.. పుష్కరాలకు పూర్తి చేస్తే సంతోషం.
No comments:
Post a Comment