Thursday, 10 April 2014

నా శ్రీమతి బెస్ట్...

ఇంటినీ, గుర్రాన్ని నడపడంలో నా శ్రీమతి బెస్ట్...

Monday, 7 April 2014

శోభాయమానం

శ్రీరామ నవమి కల్యాణోత్సవాలు విజయవాడ బీసెంట్ రోడ్డులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం తరహాలోనే ఇక్కడ సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. బీసెంట్ రోడ్ విద్యుదీపాలతో
శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం మధ్యాహ్నం జరిగే కల్యాణాన్ని కనులారా వీక్షించిచాల్సిందే. ఇక్కడ కూడా ముత్యాల తలంబ్రాలు ఉపయోగించడం ప్రత్యేకం. బ్లాగ్ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 

Saturday, 5 April 2014

బెజవాడ కనకదుర్గమ్మ

బెజవాడ కనకదుర్గమ్మకు శుక్రవారం కలువపూలు, మరువంతో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. జగన్మాత వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు రోజుకొక రకమైన పువ్వులతో పూజిస్తున్నారు. 

Thursday, 3 April 2014

వసంత నవరాత్రోత్సవాలు


ఇంద్రకీలాద్రిపై  చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఆలయ అర్చకులు కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నిలువెత్తు కనకాంబరాలను సమర్పించారు.

manchi pravarthana