Friday, 27 September 2013

చదువులు చట్టుబండలేనా?


సీమాంధ్రాలో సమైక్య ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. పిల్ల,పెద్ద అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. 13 జిల్లాల్లో పాలన స్తంభించింది. 57 రోజులుగా ఉద్యమం చేస్తన్నా కేంద్రం స్పందించక పోగా తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుపోతుంది. ఎన్ని ఉద్యమాలు చేసినా వెనక్కు తగ్గేది లేదని చెప్తున్నప్పుడు సమ్మె చెసి ఉపయోగం ఏమిటి? ఉద్యమకారులు ఆలోచించండి. ఎమ్మేల్యేలు, ఎంపీలంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొంటే కేంద్రం దిగి వస్తోంది. ఎన్జీవోలు ఎన్నిరోజులు నిరసన తెలిపినా ప్రయోజనం లేదు. పిల్లల చదువులు చట్టుబండలు కావడం తప్ప. నిరసన కారులు ఒకసారి ఆలోచించండి. వ్యాపారాలు లేక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారుల పరిస్తితి ఇంకా దారుణంగా ఉంది. ఉపాధ్యాయులు 2 నెలలుగా బడికి వెళ్ళక పొవటంతో సిలబస్ ఎప్పుడు పూర్తిచేస్తారో తెలియదు. ఉద్యమకారులు ఒకసారి ఆలొచించండి.

No comments:

Post a Comment