Sunday, 31 March 2013

వ్యంజకం


వ్యంజకం


బడి ఈడు పిల్లలు బడిబాట పట్టాలంటూ
ప్రభుత్వ ప్రదర్సనలు
ఆ ప్రదర్శనలో అందరూ
బాల కార్మికులే

Friday, 29 March 2013


వ్యంజకం


ఉపాధ్యాయులు


కులరహిత సమాజరూపకర్తలు
ఉపాధ్యాయులు
ఏర్పాటుచేస్తున్నారు
కులాలవారీగా సంఘాలు


Tuesday, 26 March 2013


రంగు కేళి హోళి

ఆనందాల కేళిలోతనువు తడిసిందిరంగుల లోకంలో మనస్సు వికసించింది


Saturday, 23 March 2013


దుర్గమ్మ దర్శనానికి గంటల తరబడి జనం నీరీక్షణంవీఐపీలకు మాత్రంనిమిషాలలో దర్శనం

vyanjakam



వినాయక పందిళ్ళతోపెంపొందిన భక్తి భావంలడ్డూ వేలంపాటలతోచేస్తున్నారు వ్యాపారం

Tuesday, 19 March 2013


నా చిట్టికవిత


మోనాలిసా లాంటి అందమున్నా
కట్నం ఇవ్వకపోతే కాదు పెళ్ళి
షాజహాన్ లాంటి భర్త దొరికినా
ఏ తాజ్ మహల్ కట్టడు మళ్ళీ


                                శర్మ సీహెచ్

Monday, 18 March 2013


మనసు

ఆశను గిల్లి
అధైర్యాన్ని చల్లి
చీకటి సంద్రాన
ముంచేస్తుంది మనసు

Sunday, 17 March 2013

kavitha


వందేయువతరం


వందేయువతరం
మందే నిరంతరం
నిషా కోసం ఆరాటం
పబ్బుల్లో కాలక్షేపం
ఉద్యమాలతో భవిష్యత్ ఆగాధం
పార్టీల కోసం ప్రాణ త్యాగం
కుటుబాలలో తీరని విషాదం
తల్లితండ్రులకు పుట్టెడు దుఖం
యువతలో మార్పు కోరుదాం
నవసమాజ నిర్మాతలకు
మార్గ నిర్దేశం చేద్దాం  

Friday, 15 March 2013

పిల్లల విజ్ఞాన దిక్చుచీలు
కంపూటర్లు
ఇంటర్నెట్ చాటింగ్ ల తో
అలముకుంటున్న చీకట్లు
పేదలందరికీ ఉచితంగా ఇల్లు
పదె లయన దాటలేదు పునాదులు