మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. 29-12-13 విజయవాడ కేబీఎన్ కళాశాలలో జరిగిన సభలో బహుమతితోపాటు సర్టిఫికెట్ అందుకుంటున్నప్పటి దృశ్యం.
పాణీలు-6
నాడు చిన్నారి చేతిలో స్లేట్నేడు బుజ్జాయి పట్టుకున్నాడు టాబ్లెట్..
ఆవిడ కంటతడి ఆరడం లేదుతెలుగు సీరియల్ నటి మరి...
పాణిగ్రాహి రాజశేఖర్, 29-12-13
పాణీలు-5
ఆ పిల్లలు బుక్ వదలడం లేదు
అవును ఎఫ్ బి దెయ్యం పట్టింది
ఆ కాలేజీలకే ర్యాంకుల పంట..
అవన్నీ కోతలేనంట...
విద్యార్థినుల ఆత్మహత్యలతో
తల్లిదండ్రులకు కడుపుకోతలే మిగిలేనంట..
పాణిగ్రాహి రాజశేఖర్
28-12-13
పాణీలు-4
1. పల్లేలకూ పాకిన సూపర్ మార్ట్ లుకిరణా దుకాణాలకు తాళాలు
2. వ్యవసాయ సీజన్ మొదలుకూలీలకు చేతినిండా పనులుకాంట్రాక్టర్ కు కాసుల పంటలు
27-12-13 పాణిగ్రాహి రాజశేఖర్
పాణీలు - 3 (నానీలు )
జనారణ్యంలో
పక్షుల కువకువలు..
బ్యాటరీ బొమ్మల
రాగాలు మరి...
క్యాబరే డాన్సర్లకు
డిమాండ్ తగ్గింది...
ఐటంసాంగ్ ల
ఎఫెక్ట్ మరి...
- పాణిగ్రాహి రాజశేఖర్