Wednesday, 12 June 2013


Joke

సుబ్బారావు : అరే అప్పారావు ఈ రోజు నేను మా ఆవిడను తిట్టానోయ్..
అప్పారావు : అంత ధైర్యం ఎలా వచ్చిందిరా?
సుబ్బారావు : మరేమో మా ఆవిడ నన్ను పచ్చడి బండతో కొట్టిందిరా..
అప్పారావు : ఆ..ఆ...


(నేను రాసిన ఈ జోక్ విజేత సండే బుక్ లో వచ్చింది(విజేత 2001లో గుంటూరు కేంద్రంగా ప్రచురితమయ్యేది)

Sunday, 9 June 2013


నేతల పర్యటనలు అవసరమా?


కార్పొరేటర్ నుంచి ప్రధాన మంత్రుల దాకా విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. వాటివల్ల వారు సాధించిన ప్రగతి ఎమిటో ఎవరికి తెలియదు. వందల కోట్ల రూపాయలతో వారు షికార్లు చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారే తప్ప ప్రజలకు, దేశానికి ఉపయోగపడడం లేదు. మరి మీరేమంటారు...నిజం కాదంటారా? ఇంతకీ మన ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా...అక్షరాలా 642 కోట్లు..తొమ్మిదేళ్లలో 67 విదేశీ పర్యటనల ఖర్చు అది. ఈ వివరాలు పి ఎం ఓ కార్యాలయమే అందించింది.

Friday, 7 June 2013

దిన, వార, మాస, త్రైమాస, పత్రికల తొలి సంచికలు సేకరించి లిమాక బుక్ రికార్డ్స్ కెక్కిన పులిపాటి దుర్గారావు గురించి నేను రాసిన వ్యాసం సాహితీకిరణం జూన్ సంచికలో ప్రచురితమైంది.