దుర్గా ఫ్లై ఓవర్ కష్టాలు మరో ఆరు నెలలు...
దుర్గ ఫ్లై ఓవర్ పుష్కరాలనాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా ప్రకటించాడు. పనులు ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఉన్న మాకు నరకం చూపిస్తున్నారు. ఆరు నెలలే కదా అని సమస్యలతో సతమతమవుతున్నాం. కానీ పనులు మరో ఆరు నెలలకు గాని పూర్తికావు అని అధికారులే ప్రకటించడంతో మాకు మరో ఆరు నెలలు నరకం తప్పేటట్టు లేదు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబుకు సాటి మరెవ్వరూ లేరు. అభివృద్ధి మాట దేవుడెరుగు అస్తవ్యస్తమైన రోడ్లతో నానావస్తలు పడుతున్నాము. వేసవి సెలవులు ముగిసాక పిల్లలకూ తప్పవు పాట్లు. ఈ ఫ్లై ఓవర్ త్వరగా పూర్తవ్వాలని మేమందరం ఎదురుచూస్తూ......