Saturday, 21 June 2014

"క్రూర"గాయాలు

నిన్న కృష్ణా తరంగాలు గ్రూప్ లో నిర్వహించిన చిత్ర కవిత పోటీలో నన్ను విజేతగా ప్రకటించారు. నేను రాసిన ఆ కవిత ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

"క్రూర"గాయాలు
భానుడి విశ్వరూపం
విలవిల లాడుతున్న జనం
సాగునీటి ఇక్కట్లు..
కూరగాయల ధరలకు రెక్కలు
ఆకాశంలో ధరలు
వినియోగదారుడి జేబుకి చిల్లులు
టమాటా...ఇరవై పై మాట..
బెండ..దొండ..వంగ..
కొనాలంటే..బెంగ..
సరుకు రవాణాపై మోడి మోత
ప్రజలకు వాత
ప్రభుత్వాలు మారినా మారని సగటు జీవి బతుకు చిత్రం
జీవితమంతా వ్యధాభరితం
పాణిగ్రాహి రాజశేఖర్
21-6-14

Thursday, 5 June 2014

రోజురోజుకు...

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడదాం


పర్యవరణ పరిరక్షణ అందరి బాధ్యత. కాంక్రీట్ జంగిళ్ల లాంటి మన నగరాల్లో కాలుష్యం రోజురోజుకు అధికమవుతుంది. చాలా సంస్థలు మొక్కలు నాటుతున్నట్లు పత్రికల్లో ఫొటోలు దిగి ఆ తర్వాత వాటి సంరక్షణ బాధ్యతలు విస్మరిస్తున్నారు. దీంతో మన లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతిఒక్కరూ ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్ళిరోజు లకు బహుమతుల బదులు మొక్కను ఇవ్వడం ఆనవాయితీ పెట్టుకుంటే భవిష్యత్ తరాలు కాలుష్య రక్కసి బారి నుంచి రక్షించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే విజయవాడలో ప్రభుత్వ ఉపధ్యాయుడు పులిపాటి దుర్గారావు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టి పలువురి ప్రశంసలు పొందారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమంతా కూడా మనకు చేతనైనంత మేరకు మొక్కలు నాటుదాం..ప్రగతికి బాటలు వేద్దాం.